Jagananna Vidya Deevena & జగనన్నVasathi Deevena Status Check, Eligibility List

జగనన్న విద్యాదీవెన & వసతి దీవెన ‘Jagananna Vidya Deevena’ & ‘Vasathi Deevena’ Eligibility List Selection List will be Released Soon.

Jagananna Vidya Deevena Scheme: పదో తరగతి తర్వాత పై చదువులు చదివే విద్యార్థుల (పోస్ట్‌మెట్రిక్‌ కోర్సులు) తల్లిదండ్రులపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన పథకాన్ని తీసుకువచ్చింది. దీని ద్వారా షెడ్యూల్డ్‌ కులాలు, తెగలు; వెనుకబడిన తరగతులు, మైనారిటీలు, కాపు, ఈబీసీ, దివ్యాంగులైన విద్యార్థులకు 100 శాతం ఫీజు రియింబర్స్‌మెంట్‌ అందిస్తారు. విద్యార్థుల కుటుంబాలపై అధికభారం మోపే ఆహారం, ప్రయాణం, వసతి, పుస్తకాలు తదితర ఖర్చులను తగ్గించడానికి ఒక్కో విద్యార్థికి ఏడాదికి రూ.20,000ను అందజేస్తారు. దీని ద్వారా సుమారు 15.5 లక్షల మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతారు. ఈ పథకానికి 2019-20 రాష్ట్ర బడ్జెట్‌లో రూ.4,962.3 కోట్లను కేటాయించారు.

 • చదువుకు ఫీజు.. ఎంతైనా చెల్లింపు
 • విద్యార్థి వసతి, మెస్‌ ఖర్చులకు ఏటా రూ.20 వేలు
 • నూతన మార్గదర్శకాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
 • ఈ ఏడాది (2019–20) నుంచే అమలు
 • ఒక ఇంట్లో ఎంత మంది చదువుతుంటే అంత మందికీ వర్తింపు
 • కుటుంబ ఆదాయ పరిమితి రూ.2.50 లక్షలకు పెంపు
 • 10 ఎకరాల మాగాణి లేదా 25 ఎకరాల మెట్ట పొలం.. రెండూ కలిపి 25 ఎకరాల్లోపు ఉన్నా కూడా అర్హులే
 • ఫీజు కాలేజీ అకౌంట్‌కు, వసతి సొమ్ము
 • తల్లి లేదా సంరక్షకుని ఖాతాకు జమ

Jagananna Vidya Deevena Important Links

Eligibility List: Click Here

Ineligibility List: Click Here

G.O.Ms.No.115 , Dated : 30-11-2019–జగనన్న విద్యా దీవెనకు ఉత్తర్వులు: Click Here

About this Scheme

In addition to 100 % fee reimbursement to students belonging to the SC, ST, BC, Minorities, Kapu, EBC and differently-abled categories and those pursing post-matric courses, the government will provide an annual financial support of ₹20,000 to each of the beneficiaries under the Jagananna Vidya Deevena scheme. Funds to the tune of ₹4,962.3 crore were allocated for it.

ఉన్నత చదువులకు స్థోమత లేని పేద పిల్లలు ఇకపై ఎంత వరకు చదువుకుంటే అంత వరకు అయ్యే మొత్తం ఫీజును రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. దీంతో పాటు హాస్టల్, మెస్‌ ఖర్చులకు సైతం ఏకంగా ఏటా రూ.20 వేలు ఇవ్వనుంది. ఈ మేరకు గతంలో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి శనివారం నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. నవరత్నాల్లో భాగంగా పోస్టు మెట్రిక్‌ స్కాలర్‌షిప్స్‌ విధానంలో మార్పులు చేస్తూ జగనన్న విద్యా దీవెన (రీయింబర్స్‌మెంట్‌ ఆఫ్‌ ట్యూషన్‌ ఫీజు – ఆర్టీఎఫ్‌), జగనన్న వసతి దీవెన (మెయింటెనెన్స్‌ ఫీజు – ఎంటీఎఫ్‌) పథకాలను తెచ్చింది. ఇందుకోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, కాపు, మైనార్టీ, దివ్యాంగ వర్గాల విద్యార్థుల చదువుకు పూర్తి ఫీజు, వసతికి ఆర్థిక సాయం పెంచుతూ ఇటీవల జరిగిన మంత్రి మండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంది. గతంలో జారీ చేసిన సూచనలు, మార్గదర్శకాలను ఈ మేరకు సవరిస్తూ ఇంటర్‌ మినహా పోస్టు మెట్రిక్‌ కోర్సులు..

ఐటీఐ నుంచి పీహెచ్‌డీ వరకు ఈ పథకాలను అమలు చేస్తుంది.

           ఈ పథకాలకు సంబంధించి అర్హులైన విద్యార్థులందరికీ సంతృప్త స్థాయిలో ‘వైఎస్సార్‌ నవశకం ఫీజు రీయింబర్స్‌మెంట్‌’ కార్డు జారీ చేస్తారు. విద్యార్థి ఫీజును సంబంధిత కళాశాల ఖాతాకు, వసతి సొమ్మును తల్లి లేదా సంరక్షకుని అకౌంట్‌కు జమ చేస్తారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో అత్యంత కీలకమైన ఈ పథకాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ఏడాది (2019–20) నుంచే అమలు చేయనుండటం అతిపెద్ద సామాజిక మార్పునకు నాంది పలకనుంది. కుటుంబంలో ఉన్న అర్హులైన పిల్లలందరికీ ఉన్నత విద్య చదివే అవకాశం దక్కడంతో ఆ కుటుంబం అన్ని విధాలా స్థిరపడుతుంది. 

– జగనన్న విద్యా దీవెన పథకం : అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌.
– జగనన్న వసతి దీవెన పథకం : హాస్టల్, ఆహార ఖర్చులకు ఐటీఐ విద్యార్థులకు (ఒక్కొక్కరికి) రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు (ఒక్కొక్కరికి) రూ.15 వేలు, డిగ్రీ, ఆపై చదువుతున్న విద్యార్థులకు (ఒక్కొక్కరికి) రూ.20 వేలు ఇస్తారు. ఈ మొత్తాన్ని ఏడాదిలో రెండు దఫాలు (జూలై, డిసెంబర్‌లో)గా అందజేస్తారు. 

అర్హతలు, అనర్హతలు

– విద్యార్థులు రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, బోర్డులకు అనుబంధంగా ఉన్న ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్‌ కాలేజీల్లో చదువుతుండాలి. 
– డే స్కాలర్‌ విద్యార్థులు, కాలేజీ అటాచ్డ్‌ హాస్టల్స్‌ (సీఏహెచ్‌), డిపార్ట్‌మెంట్‌ అటాచ్డ్‌ హాస్టల్స్‌ (డీఏహెచ్‌) విద్యార్థులు 75 శాతం హాజరు కలిగి ఉండాలి. – కుటుంబ సభ్యులకు కార్లు, ఇతర నాలుగు చక్రాల వాహనాలు ఉండ కూడదు. ప్రభుత్వ ప్రాయోజిత పథకాల కింద ట్యాక్సీలు, ట్రాక్టర్‌లు, ఆటోలు తీసుకున్న కుటుంబాలకు మినహాయింపు ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో (రెసిడెన్షియల్‌ లేదా కమర్షియల్‌) 1,500 చదరపు అడుగులలోపు సొంత స్థలం కలిగి ఉన్న వారు కూడా అర్హులే. 
– దూర విద్య, ప్రైవేట్, డీమ్డ్‌ యూనివర్సిటీల్లో చదువుతున్న వారు, మేనేజ్‌మెంట్‌ కోటా కింద చేరిన వారు, కుటుంబ సభ్యుల్లో ప్రభుత్వ ఉద్యోగి, పెన్షనర్‌ ఉన్న వారు అనర్హులు.
ఆదాయ పరిమితి 
– కుటుంబ వార్షిక ఆదాయం రూ.2.50 లక్షల కంటే తక్కువ ఉండాలి. 
– కుటుంబానికి 10 ఎకరాల మాగాణి, 25 ఎకరాల మెట్ట భూమి ఉండవచ్చు. లేదా.. మెట్ట, మాగాణి కలిపి 25 ఎకరాల లోపు ఉండాలి. 
– వార్షికాదాయంతో సంబంధం లేకుండా శానిటరీ వర్కర్స్‌ పిల్లలు అర్హులు. 
దరఖాస్తు ఇలా..
– ఆయా కళాశాలల యాజమాన్యాలే అర్హత గల విద్యార్థుల పూర్తి వివరాలను జ్ఞానభూమి వెబ్‌సైట్‌లో ఆయా విభాగాలకు అప్‌లోడ్‌ చేస్తాయి.
– ఆదాయ పరిమితి పెంచినందున తహశీల్దార్‌ ఇచ్చే ధ్రువీకరణ పత్రాన్ని పరిగణనలోకి తీసుకుని కొత్త విద్యార్థులకు అర్హత కల్పిస్తారు.

Jagananna Vidya Deevena (RTF) & Jagananna Vasathi Deevena

Deevena (MTF) Cards:

 • Under Jaganann Vidya Deevena complete fee reimbursement (RTF).
 • Under Jagananna Vasathi Deevena Rs. 20,000/- per annum will be provided to every student for food and hostel expenses from the year 2019-2020.
 • All the students pursuing Polytechnic, ITI, Degree and above level courses in Government, Aided, Private Colleges affiliated to State Universities / Boards.

The families:

 • whose annual income is less than Rs. 2.5 lakh.
 • having less wet 10 acres or dry 25 acres or 25 acres wet and dry.
 • No member should be a Government employee or pensioner (all sanitary workers are exempted.).
 • The family should not own 4 wheeler (Taxi, Auto, Tractors Exempted)
 • No family member should pay income tax.
 • In municipal areas owning less than 1500 sft of built-up area

Jagananna Vidya Deevena Scheme: Eligibility Criteria and Complete Details

 • The complete fee reimbursement is ensured for the students.
 • Students will get a sum of Rs 20,000 every year for a fee, hostel, and food facilities.
 • Students of Government, Aided, and Private Colleges are eligible to apply for this scheme.
 • The family’s annual income should be less than Rs 2.5 Lakh per anum.
 • Beneficiaries can have the wetland below 10 acres/ agricultural land below 25 acres/ or wetland and agricultural land under 25 acres.
 • If anyone of the family working for a government job, or if anyone in the family is availing pension, in such case, the students are ineligible to apply this scheme. Sanctuary workers are exempted from this.
 • The beneficiary’s family members should not have any 4 wheeler [Car, Auto, Taxi, etc].
 • If anyone of the family members is paying property tax, the candidates are ineligible to apply for this scheme.
 • Candidates having less than 1500 Square Feet house in the city are also eligible to apply this scheme.

The Present Scholarship Scheme

 • At present, students of SC, ST, BC, Minority, and EBC categories are availing a scholarship of Rs 5,000 per year.
 • For students who are studying from welfare, hostels are not getting any scholarship. While the Government offering Rs 1400 every month per 10 months for the mess charges.
 • The Government is only offering the scholarship, and mess charges for the students if the attendance is more than 75% per year.

The New Scheme [Revised]

 • The Government is going to facilitate the tuition fee, hostel fee for the students who are studying Degree, Engineering, and other courses. Per year, a student will be given Rs 20,000/-.
 • Students who are studying from Welfare hostels will be exempted from mess charges. The government will be directly paying the mess charges to the welfare hostels for the poor students. The remaining amount will be directly transferred to the ward’s mother’s account.
 • Jagananna Vidya Deevena Cards will be issued for eligible candidates, who are availing the benefits of this scheme.
 • Students must have 75% above attendance every year to avail of the tuition fee reimbursement.

Jagananna Vidya Deevena Scheme: Eligible Courses

 • B.Tech,
 • B.Pharmacy,
 • ITI
 • Polytechnic
 • M.Tech,
 • M.Pharmacy,
 • MBA,
 • MCA,
 • B.Ed
 • And Other Degree/PG Courses

 

Share this post with your Friends:


Previous article
Next article

Leave a Reply